News November 25, 2024

సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అన్‌సోల్డ్

image

ఐపీఎల్ మెగా వేలంలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఆయనను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు అర్జున్ స్నేహితుడు పృథ్వీషాను కూడా ఏ ఫ్రాంచైజీ కొనని సంగతి తెలిసిందే.

Similar News

News January 24, 2026

నచ్చని తీర్పిస్తే జడ్జీని బదిలీ చేస్తారా: జస్టిస్ భూయాన్

image

GOVTకి నచ్చని తీర్పిచ్చారని జడ్జీనెందుకు బదిలీ చేయాలని జస్టిస్ భూయాన్(SC) ఓ వేదికపై ప్రశ్నించారు. అది జుడీషియరీపై ప్రభావం చూపదా అన్నారు. ఇది కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. గత ఏడాది కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన MP మంత్రికి HC జడ్జీ శ్రీధరన్ నోటీసులిచ్చారు. ఆ తర్వాత అలహాబాద్ బదులు ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేశారు. దీనినే భూయాన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

News January 24, 2026

Photo Gallery: విద్యార్థులతో సీఎం చంద్రబాబు

image

AP: ఇవాళ నగరి పర్యటనలో CM CBN కాసేపు విద్యార్థులతో గడిపారు. బాలురు, బాలికల పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లను సందర్శించారు. నెట్ జీరో కాన్సెప్ట్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, నెట్ జీరో ఎలక్ట్రిసిటీలో భాగంగా స్కూలుపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్, కంపోస్ట్ పిట్‌ను పరిశీలించి మాట్లాడారు. హాస్టల్ రూమ్స్, కిచెన్ రూమ్స్ తనిఖీ చేశారు.

News January 24, 2026

‘రథ సప్తమి’ ఎందుకు జరుపుకొంటారు?

image

సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే క్రమంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు. అలాగే సూర్యుడు 7 గుర్రాల రథంపై జగత్తుకు దర్శనమిచ్చింది కూడా ఈరోజే. నేటి నుంచి సూర్య కిరణాలు భూమికి దగ్గరగా వచ్చి ప్రాణికోటికి చైతన్యం, జఠరాగ్ని పెరుగుతాయని నమ్ముతారు. పాపాలను హరింపజేసే తిథి సూర్యారాధనకు అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.