News November 8, 2024
నిరుపేదల సేవలో సచిన్ భార్య, కుమార్తె

సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా రాజస్థాన్లో నిరుపేదలతో సమయాన్ని గడిపారు. పోషణ అందని చిన్నారులకు ఆహారాన్ని అందించడంతో పాటు కలిసి ఆడుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో సారా వెల్లడించారు. అన్ని కష్టాల్లోనూ అక్కడి మహిళలు చూపిస్తున్న సంకల్ప బలం తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె వెల్లడించారు.
Similar News
News January 10, 2026
‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని ‘sacnilk’ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు పేర్కొంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపు కొనసాగుతుండగా తెలంగాణలో పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది.
News January 10, 2026
NPCIL 114 పోస్టులకు నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<
News January 10, 2026
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ నేటి నుంచి 3 రోజుల పాటు స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయానికి చేరుకొని 8pmకు ఓంకార మంత్ర పఠనం చేస్తారు. రేపు ఆలయ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ శౌర్య యాత్ర, ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను ప్రారంభిస్తారు. 12న జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.


