News August 23, 2024

SAD: బస్సు ప్రమాదంలో 27 మంది మృతి

image

నేపాల్‌లోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 27కి చేరింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం 43 మంది ఉన్నట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. కాగా ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ బస్సు 8 రోజులు నేపాల్‌లో ఉండేందుకు అనుమతి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికులంతా మహారాష్ట్రకు చెందినవారేనని తెలుస్తోంది.

Similar News

News December 8, 2025

పెరిగిపోతున్న సోషల్ మీడియా ముప్పు

image

చర్మ సౌందర్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి చాలామంది మహిళలు సమస్యల్లో పడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 20- 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించే “మిరాకిల్ ట్రీట్మెంట్”ల నమ్మకంతో నకిలీ స్కిన్ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడ అనుభవం లేనివారితో ట్రీట్మెంట్లు చేయించుకొని చర్మానికి నష్టం కలిగించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాం: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని CM చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్న తమ మాటలను నమ్మి ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. 18 నెలలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచగలిగామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

News December 8, 2025

త్వరలో ఇండియాలో ‘స్టార్‌లింక్’.. ఫీజు ఇదే?

image

ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్టార్ట్ చేసేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం DoT నుంచి రెగ్యులేటరీ అనుమతి రావాల్సి ఉంది. ఈక్రమంలో ఇండియాలో దీని ధరలు ఎలా ఉంటాయో సంస్థ ప్రకటించింది. హార్డ్‌వేర్ కోసం రూ.34వేలతో పాటు నెలకు ₹8,600 చొప్పున చెల్లించాలి. 30 రోజులు ఫ్రీగా ట్రయల్ చేయొచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించనుంది.