News March 28, 2024
SAD: పీరియడ్స్ నొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య

ఆడవారికి ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ నొప్పి వర్ణనాతీతం. తాజాగా ముంబైలోని మల్వానీ ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలికకు తొలి రుతుక్రమం వచ్చింది. విపరీతమైన నొప్పిని భరించలేకపోయిన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. అయితే పీరియడ్స్ గురించి అవగాహన లేకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని వైద్యులు తెలిపారు.
Similar News
News December 1, 2025
పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్ విధించనున్నట్లు సమాచారం.
News December 1, 2025
ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.
News December 1, 2025
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.


