News December 18, 2024
ప్రభాస్ అభిమానులకు SAD NEWS!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావని, అందుకే ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయడం కష్టమేనని చెబుతున్నాయి. దీంతో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీ ఈ తేదీని బుక్ చేసుకోవడం గమనార్హం. తాజాగా ఈ చిత్రం కొత్త రిలీజ్ తేదీని ప్రకటించింది.
Similar News
News February 6, 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 6, 2026
గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

దేశంలో ఉద్యోగ మార్కెట్ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్ పేజ్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్ హెడ్స్‌కు డిమాండ్ పెరిగిందని తెలిపింది.
News February 6, 2026
ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్

TG: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి డిమాండ్ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.


