News November 4, 2024
యాంటీ ఇండియా ఎలిమెంట్స్‌కు కెనడా అనుమతించడం బాధాకరం: భారత్

బ్రాంప్టన్ హిందూ సభా మందిరం వద్ద <<14524265>>ఖలిస్థానీ<<>>ల దాడులపై కెనడాలోని భారత హైకమిషన్ స్పందించింది. స్థానికులతో కలిసి చేపట్టే రెగ్యులర్ కాన్సులర్ క్యాంపులకు అవాంతరాలు కలిగించేలా యాంటీ ఇండియా ఎలిమెంట్స్‌కు అనుమతించడం తీవ్ర నిరాశపరిచిందని తెలిపింది. భారతీయులు సహా లైఫ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసినవారి భద్రతపై ఆందోళన కలుగుతోందని వెల్లడించింది. అయినప్పటికీ 1000 సర్టిఫికెట్లు జారీచేశామని పేర్కొంది.
Similar News
News December 28, 2025
టీమ్ ఇండియాకు కొత్త కోచ్?

న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టుల్లో IND ఘోరంగా ఓడిపోవడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలని BCCI భావిస్తోందని వార్తలొస్తున్నాయి. ఆయన స్థానంలో సొగసరి బ్యాటర్, తెలుగు క్రికెటర్ VVS లక్ష్మణ్‌ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పనిచేస్తున్నారు.
News December 27, 2025
ఇరిగేషన్ శాఖ సలహాదారుపై BRS గురి!

TG: అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ముందు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌పై BRS గురిపెట్టింది. 2014-19 మధ్య CBN పాలనలో AP నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి పనులను నిలిపివేశారని BRS ఆరోపిస్తోంది. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు CM రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టును నిలిపివేయడంలో ఆదిత్యనాథ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
News December 27, 2025
రేపు అయోధ్యకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రస్తుతం HYDలో ఉన్న ఆయన రేపు ఉదయం 9 గంటలకు రామ జన్మభూమికి వెళ్తారు. ఉ.11.30 నుంచి మ.2.30 వరకు రామమందిరంలో ఉంటారు. అనంతరం మ.3గంటలకు అయోధ్య నుంచి విజయవాడకు బయల్దేరుతారు. మరోవైపు ఈ నెల 30న సీఎం కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లనుందని తెలుస్తోంది. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన అనంతరం తిరిగి వస్తారని సమాచారం.


