News April 2, 2025
SAD: విధుల్లో చివరి రోజే జీవితంలోనూ ఆఖరి రోజైంది!

ఆ లోకో పైలట్‌కి విధుల్లో అదే ఆఖరి రోజు. ‘త్వరగా వచ్చేస్తాను.. అందరం డిన్నర్‌కి వెళ్దాం’ అని కుటుంబానికి మాట ఇచ్చారు. కానీ విధుల్లో చివరి రోజే జీవితంలోనూ ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయారు. నిన్న ఝార్ఖండ్‌లో గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన గంగేశ్వర్ మాల్ కన్నుమూశారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు నాన్నా అంటూ ఆయన కుమార్తె గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Similar News
News April 3, 2025
ఆ ఫొటోగ్రాఫర్‌ను పట్టిస్తే రూ.10 లక్షలిస్తాం: కాంగ్రెస్ నేత

HCU భూములను జేసీబీలు చదును చేస్తుంటే అక్కడే ఉన్న జింకలు, నెమళ్లు పరుగులు తీసిన ఫొటోను సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఇది ఏఐ ఎడిటెడ్ ఫొటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఇంత గొప్ప ఫొటోను తీసిన వ్యక్తిని గుర్తించి తమకు పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డ్ ఇస్తామని సెటైరికల్ ట్వీట్ చేశారు.
News April 3, 2025
3వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

భారీ భూకంపం ధాటికి మయన్మార్‌లో మృతుల సంఖ్య 3,085కు చేరినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడించింది. 4,715 మంది గాయపడ్డారని, 341 మంది గల్లంతయ్యారని తెలిపింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం మృతుల సంఖ్య ప్రభుత్వం చెప్పినదానికంటే చాలా అధికంగా ఉంటుందని సమాచారం. భూకంప విధ్వంసం కారణంగా 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస నివేదిక పేర్కొంది.
News April 3, 2025
ట్రంప్ టారిఫ్‌లు, చైనా ఆక్రమణలపై ఏం చెప్తారు?: రాహుల్

భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల అంశాన్ని LOP రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. ‘ఈ టారిఫ్‌లపై కేంద్రం స్పందించాలి. ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అటు భారత్‌కు చెందిన 4వేల చ.కి.మీపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అక్కడి రాయబారి ద్వారా ఈ విషయం తెలిసిందని సంచలన ఆరోపణలు చేశారు.