News September 13, 2024
ప్రభాస్తో సినిమా మిస్ అయినందుకు బాధపడ్డా: రకుల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో మూవీ మిస్ కావడం తనను బాధించిందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ‘నా కెరీర్ స్టార్టింగ్లో ఓ సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ చేశా. షూటింగ్ అనంతరం ఢిల్లీ వెళ్లా. తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు. నా స్థానంలో వేరొకరిని తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసింది. ప్రభాస్తోనే చేయాల్సిన మరో మూవీ షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు’ అని ఆమె చెప్పారు.
Similar News
News September 4, 2025
వీటిపై త్వరలో 40శాతం జీఎస్టీ!

లగ్జరీ వస్తువులపై త్వరలో 40 శాతం పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్పై 40శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28శాతం శ్లాబులే కొనసాగనుండగా, త్వరలో 40 శాతం అమలు చేస్తామన్నారు.
News September 4, 2025
GST శ్లాబులతో సామాన్యులకు మేలు: మోదీ

సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తూ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేలా కొత్త GST <<17605492>>శ్లాబులు<<>> ప్రకటించామని PM మోదీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయం రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఇది పౌరుల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చిరు వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు దోహదపడుతుందని మోదీ వెల్లడించారు.
News September 4, 2025
ఆ శరణార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీలకు(ముస్లిమేతరులు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్ పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకున్నా దేశంలో ఉండటానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31, 2024 వరకు దేశానికి వచ్చిన వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పింది.