News March 28, 2024

NIA డైరెక్టర్ జనరల్‌గా సదానంద్ దాతె

image

మహారాష్ట్ర ఆంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ సదానంద్ వసంత్ దాతెను NIA డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న దినకర్ గుప్తా ఈనెల 31న రిటైర్ కానున్నారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్న వసంత్ 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 26/11 ముంబై పేలుళ్ల ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌ను ఈయనే పట్టుకున్నారు. అప్పుడు ఈయన ముంబై అడిషనల్ సీపీగా పనిచేస్తున్నారు.

Similar News

News April 2, 2026

ఇలాంటి కొడుకు బతికున్నా ప్రయోజనం లేదు!

image

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తల్లిదండ్రుల మీద దయ, ప్రేమలేని కుమారుడు పుట్టినా, చచ్చినా ఒక్కటే. ఎవరికీ ఉపయోగం ఉండదు. పుట్టలో చెదలు నిరంతరం పుడుతూ, చస్తూ ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. తల్లిదండ్రులకు సేవ చేయని కొడుకు కూడా ఆ చెదలతో సమానమే. <<-se>>#PADHYAM<<>>

News April 2, 2026

సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లోని మూవీపై ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.

News April 2, 2026

రూపీ సూపర్ రికవరీ

image

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.