News October 10, 2024
‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,980

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం, మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. బుధవారం రూ.6,925కి చేరింది. ఈరోజు మరింత పెరిగి రూ.6,980 అయింది. ధరలు పెరగడం అన్నదాతలకు ఉపశమనం కలిగించే విషయమైనప్పటికీ, ఆశించిన స్థాయిలో ధర రావట్లేలేదని వాపోతున్నారు. ధర రూ.8 వేలు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
News November 27, 2025
WTC ఫైనల్.. భారత్ చేరుకోవడం కష్టమే!

SAతో టెస్టు సిరీస్లో ఓటమితో.. భారత్కి 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం 48.15%తో ఐదో స్థానంలో ఉన్న టీమ్ఇండియా.. మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు, 2 డ్రాలు లేదా ఏడు విజయాలు సాధించాలి. ఫైనల్కు చేరుకోవాలంటే కనీసం 60% పాయింట్లు అవసరం. శ్రీలంక, న్యూజిలాండ్ విదేశీ టూర్లతో పాటు, ఆస్ట్రేలియాతో 5 హోం టెస్టులు భారత్కు కఠిన సవాల్గా మారనున్నాయి.
News November 27, 2025
రూ.89కే X ప్రీమియం ఆఫర్

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని X.. ప్రీమియం సేవలను కేవలం రూ.89కే అందిస్తూ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. Grok AI, బ్లూ టిక్ మార్క్, తక్కువ యాడ్స్, రీచ్ ఎక్కువ, క్రియేటర్ మానిటైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. డిసెంబర్ 2 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ప్రీమియం రూ.89కి, ప్రీమియం+ ప్లాన్ను రూ.890కి పొందే అవకాశం ఉంది. మొదటి నెల తర్వాత ధరలు మళ్లీ రూ.427 (Premium), రూ.2,570 (Premium+)కి మారుతాయి.


