News October 22, 2025
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
Similar News
News October 22, 2025
3 సార్లు ఫోన్ చేసినా జగన్ నంబర్ పని చేయలేదు: సీబీఐ

YCP చీఫ్ జగన్ లండన్ పర్యటనకు సంబంధించి <<18018569>>సీబీఐ పిటిషన్<<>>పై వాదనలు పూర్తయ్యాయి. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు 3సార్లు ఫోన్ చేసినా ఆయన ఇచ్చిన నంబర్ పని చేయలేదని CBI వాదనలు వినిపించింది. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్ ఇచ్చారంది. మరోసారి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. జగన్, CBI తరఫు వాదనలు విన్న CBI కోర్టు తీర్పును ఈ నెల 28న వెల్లడిస్తానని పేర్కొంది.
News October 22, 2025
రేపటి మ్యాచ్‌కు వర్షం ముప్పుందా?

రేపు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగే అడిలైడ్‌లో వర్షం ముప్పు 20% ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అయితే మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చని పేర్కొంది. దీంతో 50 ఓవర్ల ఆట జరగనుంది. ఇక తొలి వన్డేకు వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఇందులో AUS 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే రేపటి మ్యాచులో తప్పక గెలవాలి.
News October 22, 2025
నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.250 కోట్లు విడుదల

AP: ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.250కోట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామంది. ఈ క్రమంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు వెంటనే సమ్మె విరమించాలని విన్నవించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయి నిధుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రూ.250CR విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పయ్యావుల వివరించారు.