News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’పై సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు

image

‘గేమ్ ఛేంజర్’ సినిమాపై హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు కురిపించారు. ‘చరణ్.. అప్పన్న క్యారెక్టర్‌లో ఇరగదీశావ్. ఆ పాత్రకు జీవం పోశావ్. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా మారినట్లు అనిపించింది. ఈ సినిమాను అందించినందుకు శంకర్‌కు ధన్యవాదాలు. నాకు చరణ్ నటించిన మూవీల్లో మగధీరలో హర్ష& కాలభైరవ, ఆరెంజ్‌లో రామ్, రంగస్థలంలో చిట్టిబాబు, RRRలో అల్లూరి సీతారామరాజు ఇప్పుడు అప్పన్న పాత్రలంటే ఇష్టం’ అని తెలిపారు.

Similar News

News January 10, 2025

అప్పన్నగా చరణ్ అద్భుతంగా చేశారు: చిరంజీవి

image

‘గేమ్‌ఛేంజర్’లో రామ్‌చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. ‘నిజాయితీ కలిగిన అప్పన్నగా, ఐఏఎస్ అధికారి రామ్‌నందన్‌గా చరణ్ అద్భుతంగా నటించారు. అతనికి వస్తున్న అభినందనలు చూసి సంతోషంగా ఉంది. నటీనటులు, నిర్మాత రాజు, దర్శకుడు శంకర్, మూవీ బృందం అందరికీ కంగ్రాట్స్’ అని పేర్కొన్నారు.

News January 10, 2025

BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

image

TG: ఆదివాసీలపై CM రేవంత్ వరాల జల్లు కురిపించారు. ఆదివాసీ యోధుడు కొమురం భీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని వారితో భేటీలో తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు 100% ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తామన్నారు. గిరిజన రైతులకు ఉచితంగా సోలార్ మోటర్లు అందిస్తామని, ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోండు భాషలో బోధనపై నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

News January 10, 2025

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన

image

ఐర్లాండ్‌ మహిళా టీమ్‌తో జరిగిన <<15119434>>తొలి వన్డేలో<<>> 29 బంతుల్లో 41 రన్స్ చేసిన స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. అత్యంత వేగంగా(95 మ్యాచ్‌లు) 4,000 ODI పరుగులు పూర్తిచేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడో క్రీడాకారిణిగా ఘనత సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన బిలిందా క్లార్క్(86), మిగ్ లానింగ్(87) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గతంలో మిథాలీరాజ్ 112 వన్డేల్లో ఈ ఫీట్ నమోదుచేశారు.