News May 15, 2024
విజయ్ దేవరకొండ సరసన సాయిపల్లవి?
విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న ‘SVC59’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. రవికిరణ్ కోలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. కాగా ఈ మూవీలో నటించే నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలియాల్సి ఉంది.
Similar News
News January 11, 2025
సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేయాలి: KTR
TG: సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్ కూలి ₹80cr ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని KTR అన్నారు. ఆ సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ₹4,350cr కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పంచిపెట్టి భారీ స్కామ్‌కు తెరతీశారని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని, ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
News January 11, 2025
వారికి నెలకు రూ.2లక్షల జీతం
AP: క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్‌టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.
News January 11, 2025
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వచ్చి పుష్కరమైంది
పండుగొచ్చిందంటే చాలు టీవీల్లో శ్రీకాంత్ అడ్డాల తీసిన కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రసారమవుతుంది. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబాల మధ్య ఉండే బంధాలు, బంధుత్వాలు, పల్లెటూరి అందాలను ఎంతో చక్కగా చూపించారు.