News February 4, 2025

చైతూను ఇంటర్వ్యూ చేయనున్న సాయి పల్లవి

image

‘తండేల్’ సినిమా విడుదల నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే, అనారోగ్య సమస్యలతో హీరోయిన్ సాయి పల్లవి చాలా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఈక్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేసేందుకు ఆమె ముందుకొచ్చారు. హీరో చైతూతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నానని, ఏవైనా అడిగే ప్రశ్నలుంటే చెప్పాలని సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఈనెల 7న ‘తండేల్’ విడుదలవనుంది.

Similar News

News March 16, 2026

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ గెలుపు

image

బిహార్ CM నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో 5 స్థానాలకు ఎన్నికలు జరగ్గా NDA కూటమి అన్నింటినీ కైవసం చేసుకుంది. నితీశ్ కుమార్‌తో పాటు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో నితీశ్ త్వరలోనే CM పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ MP, MLA, MLCగా పనిచేశానని, రాజ్యసభ పదవితో మిగిలిన ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పిన విషయం తెలిసిందే.

News March 16, 2026

కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

image

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.

News March 16, 2026

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. SKLM, VZM, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
– ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.