News April 3, 2025
సాయి సుదర్శన్ పరుగుల ప్రవాహం.. ఓ లుక్కేయండి!

35, 11, 20, 65*, 14, 22, 62*, 53, 19, 20, 47, 43, 96, 45, 37, 45, 33, 31, 35, 12, 31, 65, 84*, 6, 103, 74, 63, 49.. GT ఓపెనర్ సాయి సుదర్శన్ గత ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు ఇవి. IPLలో 28 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు(1220) చేసిన లిస్టులో షాన్ మార్ష్ తర్వాత స్థానంలో ఉన్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్న ఇతను.. 2022లో GT ట్రోఫీ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించారు.
Similar News
News September 15, 2025
ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్‌లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
News September 15, 2025
సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE ఘన విజయం సాధించడంతో భారత్‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్‌రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.
News September 15, 2025
BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.