News January 17, 2025
సైఫ్ అలీఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల

సైఫ్ అలీఖాన్ను ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కు తరలించినట్లు ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని బులిటెన్లో పేర్కొన్నారు. ‘చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. వెన్ను నుంచి కత్తిని తొలగించాం. ఆయన మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు. సాధారణ ఆహారం తీసుకుంటున్నారు’ అని తెలిపారు.
Similar News
News November 21, 2025
ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.
News November 21, 2025
మహిషి కన్నీరు కలిసిన జలం

శబరిమల యాత్రలో ముఖ్య ప్రాంతాల్లో ‘అళుదా నది’ ఒకటి. మహిషిని అయ్యప్ప స్వామి వధించిన స్థలం ఇదేనని ప్రతీతి. స్వామి బాణాలకు తాళలేక మహిషి రోదిస్తూ కన్నుమూశాడు. అప్పుడు కార్చిన కన్నీరు ఈ నదిలో కలిసిందట. అందుకే దీన్ని అళుదా(రోదించడం) నది అని అంటారు. అయ్యప్ప భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, 2 రాళ్లను తీసుకొని, యాత్ర మార్గంలోని కల్లిడుకుండ్రుం వద్ద విసిరి తమ యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News November 21, 2025
యూనస్ టచ్ కూడా చేయలేడు: షేక్ హసీనా కొడుకు

బంగ్లాదేశ్లో రాజ్యాంగవిరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ అన్నారు. ‘యూనస్ నా తల్లిని చంపలేరు. కనీసం టచ్ కూడా చేయలేరు. బంగ్లాలో చట్టబద్ధమైన పాలన వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది’ అని చెప్పారు. 140 రోజుల్లోనే విచారణ పూర్తి చేశారని, న్యాయ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. హసీనాకు <<18311087>>మరణశిక్ష <<>>విధిస్తూ ICT తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.


