News January 29, 2025
సైఫ్ కేసు.. అన్ని ఆధారాలున్నాయి: పోలీసులు

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో షరీఫుల్ ఫకీర్ దోషి అని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలన్నీ ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాడికి సంబంధించిన వివరాలు అతడే చెప్పాడని తెలిపారు. సైఫ్ ఇంట్లో సేకరించిన వేలి ముద్రలు నిందితుడితో మ్యాచ్ అవ్వలేదన్న వార్తలపై స్పందించారు. CID నుంచి తమకు ఇంకా ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ రాలేదని, దాడి ఘటనలో కచ్చితంగా ఫకీర్ ప్రమేయం ఉందని చెప్పారు.
Similar News
News December 5, 2025
సిరిసిల్ల: మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం లభ్యమయింది. అటుగా వెళుతున్న వాహనదారులు మృతదేహాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 5, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 5, 2025
షమీని ఎందుకు ఆడించట్లేదు: హర్భజన్

డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్నా షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదని సెలక్టర్లను మాజీ క్రికెటర్ హర్భజన్ ప్రశ్నించారు. మంచి బౌలర్లను సైడ్‌లైన్ చేసేస్తున్నారని అన్నారు. ‘ప్రసిద్ధ్ మంచి బౌలరే కానీ అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వైట్‌బాల్ క్రికెట్లో మ్యాచులు గెలిపించే బౌలర్లు ప్రస్తుత టీమ్‌లో లేరు’ అని పేర్కొన్నారు. నిన్న SMATలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచులో షమీ 4 వికెట్లు పడగొట్టారు.


