News January 22, 2025

ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్

image

ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిశారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటోడ్రైవర్‌కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భజన్ సింగ్‌కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.

Similar News

News January 22, 2025

విజయ పరంపర కొనసాగుతుందా?

image

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికే జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 4 టీ20 సిరీస్‌లలో ఇండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ కూడా గెలుపొంది వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కోహ్లీ కెప్టెన్‌గా మూడు సార్లు గెలిస్తే రోహిత్ సారథ్యంలో ఇండియా ఒకసారి గెలిచింది.

News January 22, 2025

పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

image

పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 22 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 12-30 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. శాంపిల్స్‌ను టెస్టుల కోసం ICMR-NIVకి పంపామన్నారు. కలుషితమైన నీరు/ఆహారం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నాడీ సంబంధిత వ్యాధి సాధారణంగా వైరల్/బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ఛాన్సుందని డాక్టర్లు చెబుతున్నారు.

News January 22, 2025

గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవే!

image

కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో నొప్పి, తిమ్మిరి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, జలుబు, కడుపు నొప్పి గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ (IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారని డాక్టర్లు తెలిపారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందిస్తే బాధితులు పూర్తిగా కోలుకుంటారని, ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు.