News January 16, 2025

సైఫ్‌కు తప్పిన ప్రాణాపాయం.. ముగిసిన సర్జరీలు

image

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌ కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయి. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆపరేషన్లు ముగిశాక అతడి భార్య కరీనా కపూర్ సహా కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్‌ను దుండగుడు 6 సార్లు <<15167259>>కత్తి<<>>తో పొడిచాడు. దాంతో అతడి మెడవద్ద లోతైన గాయం అయింది.

Similar News

News December 1, 2025

నారాయణపేట జిల్లాలో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు

image

నారాయణపేట జిల్లాలో హెచ్‌ఐవీ-ఎయిడ్స్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,557 కేసులు నమోదు కాగా, 1,418 మంది మరణించారు. ప్రస్తుతం 1,822 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు విస్తరిస్తుండటంతో, అధికారులు అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.

News December 1, 2025

పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

image

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్‌ విధించనున్నట్లు సమాచారం.

News December 1, 2025

ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

image

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.