News February 6, 2025

రేపు వైసీపీలోకి శైలజానాథ్

image

AP: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.

Similar News

News December 5, 2025

ప.గో: ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు

image

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం జంగారెడ్డిగూడెం డిపోను సందర్శించిన ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో సొంత, అద్దె బస్సులను ప్రవేశపెడతామన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీల ఆక్యుపెన్సీ పెరిగిందని ఎండీ తెలిపారు.

News December 5, 2025

బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

image

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్‌లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

News December 5, 2025

ఫ్రెండ్‌తో అన్నీ పంచుకుంటున్నారా?

image

స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. కానీ ఆ చెప్పే విషయాల్లో భార్యాభర్తల అనుబంధాన్నీ చేర్చవద్దంటున్నారు నిపుణులు. వారి మధ్య జరిగే విషయాల్ని మూడోవ్యక్తితో చర్చించకపోవడమే మంచిదంటున్నారు. భాగస్వామితో చిన్న గొడవ గురించి స్నేహితులకు చెబితే మీవారిపై నెగెటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతిదానికీ బయటివారి సలహాలు కోరుతూ ఉంటే నమ్మకం పోవడమే కాదు.. ఇతరులకీ చులకన అవుతారు. మరిన్ని గొడవలకూ కారణమవొచ్చు.