News October 26, 2025

సజ్జనార్ డీపీ పెట్టుకుని..

image

TG: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే IPS ఆఫీసర్ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లో సజ్జనార్ డీపీ పెట్టుకుని మెసేజులు పంపుతున్నారు. అలాంటి మెసేజులకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు అసలే ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపవద్దని హెచ్చరించారు.
* సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930

Similar News

News October 26, 2025

భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

image

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.

News October 26, 2025

అతివలకు తోడుగా ఈ టోల్‌ఫ్రీ నంబర్లు

image

బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాయి. గృహహింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమరవాణా నిరోధించేందుకు 181, బాల్యవివాహాలను నిరోధించేందుకు 1098, వేధింపుల నియంత్రణకు షీటీం, ప్రసూతి సేవలకు అంబులెన్స్‌ కోసం 102, అంగన్‌వాడీ హెల్ప్‌లైన్‌ కోసం 155209 నంబర్లను అత్యవసర సమయాల్లో సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News October 26, 2025

బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.