News October 8, 2025

మహిళల కోసం ‘సఖి సురక్ష’.. రేపే ప్రారంభం

image

AP: పట్టణ మహిళా సంఘాల సభ్యుల కోసం మెప్మా ‘సఖి సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’లో భాగంగా రేపు వైజాగ్‌లో దీనిని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 74 మున్సిపాలిటీల్లో 35 ఏళ్లు పైబడిన మహిళలకు హెల్త్ టెస్టులు చేయనున్నారు. అలాగే మహిళా సంఘాల కుటుంబాల్లోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తారు. ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో 20 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించనున్నారు.

Similar News

News March 11, 2026

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా!

image

కుంభమేళాతో పాపులరైన మోనాలిసా కేరళం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. తనకు, ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌కు రక్షణ కల్పించాలని తిరువనంతపురంలోని థంపనూర్‌ పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పేరెంట్స్‌ను పిలిచి పోలీసులు నచ్చజెప్పారు. తర్వాత తన ప్రియుడితో మోనాలిసా వెళ్లిపోయారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫర్మాన్‌తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు.

News March 11, 2026

గ్యాస్ కొరత.. కాంగ్రెస్ Vs బీజేపీ

image

గ్యాస్ కొరతపై కాంగ్రెస్, BJP మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. ATMల ముందు(నోట్ల రద్దు), ఆక్సిజన్(కరోనా) కోసం, ఇప్పుడు గ్యాస్ కోసం జనం క్యూలో ఉన్నారని ఫొటోను INC షేర్ చేసింది. దీంతో ప్రపంచ సంక్షోభాన్ని మోదీకి ముడిపెట్టినా కాంగ్రెస్‌కు ఎవరూ ఓటేయరని BJP సపోర్టర్లు కౌంటరిస్తున్నారు. మోదీ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. 8PM తర్వాత పెట్రోల్ పంపులు మూసేయాలని కాంగ్రెస్ గతంలో చెప్పిందని గుర్తుచేస్తున్నారు.

News March 11, 2026

అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

image

దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత అయోధ్యనూ తాకింది. రామమందిరం సమీపాన ఉండే అమావా ఆలయంలోని ప్రముఖ నిత్యాన్నదాన ప్రాంగణం రామ్ రసోయ్‌లో తాత్కాలికంగా అన్నదానం నిలిపివేశారు. అయోధ్యకు వచ్చే యాత్రికుల్లో వేలాది మందికి ఈ రామ్ రసోయ్ ప్రసాదాన్ని అందిస్తుంది. కాగా LPGకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని <<19316913>>TTD<<>> ఇప్పటికే IOCLను కోరింది.