News April 10, 2024

‘సలార్-2’: 2025 సమ్మర్‌లో రిలీజ్!

image

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ‘సలార్-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచే ప్రారంభమవుతుందని సినీవర్గాలు తెలిపాయి. వచ్చే వేసవికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ ఇప్పటికే నటీనటుల డేట్స్ కన్ఫర్మ్ చేశారని సమాచారం.

Similar News

News April 4, 2026

భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తాం: పాక్

image

పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామని ప్రగల్భాలు పలికారు. ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బను మర్చిపోయి ఆయన ఇలా మాట్లాడటం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో పాక్ ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News April 4, 2026

సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

image

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.

News April 4, 2026

సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

image

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.