News May 1, 2024
ఈ నెలలోనే ‘సలార్-2’ షూటింగ్ ప్రారంభం?
‘సలార్’ పార్ట్-2 షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. తొలి షెడ్యూల్‌లో 10 రోజులపాటు ప్రభాస్, పృథ్వీరాజ్‌లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దీనికోసం HYDలో ప్రత్యేక సెట్ వేసినట్లు సమాచారం. తొలుత ప్రభాస్ సీన్లు పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆరంభంలో మిగతా షూటింగ్ పూర్తిచేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. 2025 చివర్లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Similar News
News January 1, 2025
SHOCKING.. ఎంత తాగావు బ్రో?
HYD బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో షాకింగ్ రీడింగ్ నమోదైంది. వెంగళరావు పార్క్ సమీపంలో నిన్న రాత్రి 10.50 గంటల సమయంలో బైక్(TS09EK3617)పై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. అందులో 550 రీడింగ్ వచ్చింది. దీంతో రీడింగ్ చలాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా, ఎంత తాగావు బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 30 దాటితే కేసు నమోదు చేస్తారు.
News January 1, 2025
2025: తొలిరోజు స్టాక్‌మార్కెట్లు ఎలా ట్రేడవుతున్నాయంటే..
కొత్త ఏడాది తొలిరోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెలవు కావడంతో ఆసియా మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 78,033 (-110), నిఫ్టీ 23,597 (-50) వద్ద చలిస్తున్నాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. APOLLOHOSP, LT, ASIANPAINT, INFY, BRITANNIA టాప్ గెయినర్స్. BAJAJ AUTO, ADANI PORTS టాప్ లూజర్స్.
News January 1, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్
నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.