News July 4, 2024
వచ్చే నెలలో సలార్-2 షూటింగ్ మొదలు?

‘కల్కి 2898AD’ సూపర్‌హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్-2(శౌర్యాంగపర్వ) షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. AUG 10 నుంచి దాదాపు 15 రోజులపాటు షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. ప్రభాస్, పృథ్వీరాజ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారని టాక్. గతేడాది విడుదలైన సలార్ మూవీ మంచి కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News November 7, 2025
ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 7, 2025
వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.


