News February 23, 2025
జీతాలు 9.2 శాతం పెరుగుతాయ్: Aon సర్వే

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ ఈ ఏడాది భారత్‌లో <<15458704>>వేతనాలు<<>> సగటున 9.2 శాతం పెరుగుతాయని Aon PLC అంచనా వేసింది. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ 45 రంగాలకు చెందిన 1,400కు పైగా కంపెనీల నుంచి వివరాలు సేకరించింది. ఆటోమోటివ్, వెహికల్ తయారీ విభాగాల్లో అత్యధికంగా 10.2 శాతం పెంపు ఉండొచ్చని పేర్కొంది. ఆ తర్వాత NBFC(10%), రిటైల్(9.8%), ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్(9.5%) రంగాలు ఉంటాయంది.
Similar News
News February 23, 2025
ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న ముద్ర చెరగనిది: లోకేశ్

AP: కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా మంత్రి లోకేశ్ నివాళులు అర్పించారు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోని ప్రజా నాయకుడు ఎర్రన్నాయుడు. ప్రజా సమస్యలపై ఆయన స్పందించే విధానం, అనేక క్లిష్టమైన సమస్యలపై పోరాటం నేటి తరానికి ఆదర్శనీయం. రాష్ట్రానికి, తనని నమ్ముకున్న ప్రజలకి న్యాయం చెయ్యాలనే బలమైన సంకల్పం ఉంటే భాష అసలు సమస్యే కాదంటూ ఢిల్లీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు’ అని కొనియాడారు.
News February 23, 2025
IND vs PAK: టాస్ ఓడిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. IND: రోహిత్ (C), గిల్, కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్, అక్షర్, జడేజా, షమీ, కుల్దీప్, హర్షిత్.
PAK: రిజ్వాన్ (C), బాబర్, ఇమాముల్, షకీల్, సల్మాన్, తాహిర్, ఖుష్‌దిల్, అఫ్రీదీ, నషీమ్ షా, హ్యారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
News February 23, 2025
BJP అభ్యర్థులను గెలిపించండి: కిషన్ రెడ్డి

TG: ఈ నెల 27న జరిగే పట్టభద్రులు, టీచర్స్ MLC ఎన్నికల్లో BJP అభ్యర్థులను గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్‌లో ప్రముఖులు, మేధావులతో ఆయన సమావేశమయ్యారు. ‘KCRను గద్దె దించడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది. కాంగ్రెస్‌కు 14 నెలల్లోనే ఈ పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అనే పరిస్థితి ఉంది. గాల్లో దీపంలా వారి హామీలు మారాయి. అభయహస్తం మొండిహస్తంగా మారింది’ అని ఎద్దేవా చేశారు.