News August 1, 2024
శాలరీ క్రెడిటెడ్.. ఉద్యోగి ఆనందంపై లోకేశ్ ట్వీట్
AP: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఉదయమే శాలరీ క్రెడిట్ అయిందంటూ ఓ ఉద్యోగి పలకపై రాసి చూపిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్థ పాలనకు నిదర్శనం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Similar News
News February 2, 2025
బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస
TG: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.
News February 2, 2025
BREAKING: చరిత్ర సృష్టించిన భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్‌పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.
News February 2, 2025
వాంఖడే స్టేడియంలో రిషి సునాక్
భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వాంఖడే స్టేడియంలో సందడి చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల కెప్టెన్లు సూర్య, బట్లర్‌తో ఆయన సరదాగా సంభాషించారు. అంతకుముందు పార్సీ జింఖానా గ్రౌండ్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ముగియదని Xలో రాసుకొచ్చారు.