News August 29, 2024
సీఎం, ఎమ్మెల్యేలకు రెండు నెలలపాటు జీతం కట్!

ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో తనతో సహా MLAలకు రెండు నెలలపాటు జీతాలు, ప్రోత్సాహకాలు ఉండవని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు 2 నెలలపాటు జీతం, టీఏ, డీఏ తీసుకోబోమని మంత్రివర్గంలోని సభ్యులంతా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇది తక్కువ మొత్తం మాత్రమే, కానీ పౌరుల పట్ల తమ విధేయతకు ప్రతీక అని ఆయన అభివర్ణించారు.
Similar News
News December 9, 2025
HYD: సిటీలో నీటిని తోడేస్తున్నారు!

మహానగరంలో భూగర్భజలాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. వాడాల్సిన నీటి కంటే ఎక్కువ తోడుతూ భూగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే వాడేనీరే అధికంగా ఉంటోంది. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, చార్మినార్, గోల్కొండ, అంబర్‌పేట, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాడకం మరీ ఎక్కువగా ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తేల్చింది.
News December 9, 2025
తేగలు తింటే ఎన్ని లాభాలో..!

శీతాకాలంలో తాటి తేగలు (గేగులు) ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తేగల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత నివారణ, శరీర బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్థులూ తినొచ్చు. తాటి గింజలు మొలకెత్తినప్పుడు నేలలో నుంచి తవ్వి తీసిన మొలకలే ఈ తేగలు. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? comment
News December 9, 2025
శబరిమల: 18 మెట్లు – వాటి పేర్లు

1.అణిమ, 2.లఘిమ, 3.మహిమ, 4.ఈశత్వ, 5.వశత్వ, 6.ప్రాకామ్య, 7.బుద్ధి, 8.ఇచ్ఛ, 9.ప్రాప్తి, 10.సర్వకామ, 11.సర్వ సంవత్సర, 12.సర్వ ప్రియకర, 13.సర్వ మంగళాకార, 14.సర్వ దుఃఖ విమోచన, 15.సర్వ మృత్యుత్వశమన, 16.సర్వ విఘ్న నివారణ, 17.సర్వాంగ సుందర, 18.సర్వ సౌభాగ్యదాయక. ఈ 18 పేర్లు సిద్ధులు, సర్వ శుభాలకు ప్రతీక. ఇవి దాటితే అన్ని రకాల సౌభాగ్యాలను, విఘ్న నివారణను పొందుతారని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>


