News March 22, 2024
జీతాలు పెంచేందుకు అనుమతి
దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల జీతాలను కేంద్రం పెంచనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో జీతాలు పెంచేందుకు ఈసీ అనుమతించింది. జీతాల పెంపు ఎప్పటికప్పుడు జరిగేదే అని, కొత్త నిర్ణయం కాదన్న ప్రభుత్వ వివరణతో ఈసీ ఏకీభవించింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి.
Similar News
News November 25, 2024
సెన్సెక్స్, నిఫ్టీలో అక్కడ Strong Resistance
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను ఆర్జించినా Day Highని అధిగమించలేదు. సెన్సెక్స్‌లో 80,470 వద్ద, నిఫ్టీలో 24,350 వద్ద ఉన్న Strong Resistance వల్ల సూచీలు Consolidation Zoneలోనే పయనించాయి. ఉదయం 2 సూచీల్లో Pre-Open Marketలో భారీగా బిజినెస్ జరిగింది. ఆ లాభాలు మినహా ఈరోజు ప్రత్యేకించి సూచీలు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. ఉదయం ట్రేడింగ్ Open అయిన స్థాయిలోనే చివరికి Close అయ్యాయి.
News November 25, 2024
ఉమ్రాన్ మాలిక్ అన్‌సోల్డ్
SRH స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు IPL వేలంలో నిరాశ ఎదురైంది. అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. మరో పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను SRH రూ.కోటి చెల్లించి సొంతం చేసుకుంది. ఇషాంత్ శర్మను గుజరాత్ రూ.75లక్షలకు, నువాన్ తుషారాను బెంగళూరు రూ.1.6 కోట్లకు కొన్నాయి. ఇక ఉమేశ్ యాదవ్, నవీన్ ఉల్ హక్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్ అయ్యారు.
News November 25, 2024
సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన ఇజ్రాయెల్!
లెబనాన్‌లో తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడనుంది. ఈ ఒప్పందం మేరకు హెజ్బొల్లా తన బలగాలను లిటాని నదికి ఉత్తరంగా తరలించాలి. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవాలి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల విభజనపై ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జరుగుతాయి. ఈ ఒప్పందం అమలును అమెరికా పర్యవేక్షిస్తుంది.