News October 10, 2025
రూ.1.20 లక్షల జీతం.. 13న ఇంటర్వ్యూలు

AP: మైనారిటీ యువతకు ఖతర్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దోహాలో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాల కోసం ఈనెల 12లోగా http://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 13న విజయవాడలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 21-40 ఏళ్ల వయసుండి B.Sc/GNM నర్సింగ్ విద్యార్హత, అనుభవం ఉండాలన్నారు. ఎంపికైన వారు IT కటింగ్స్ లేకుండా నెలకు రూ.1.20 లక్షలు పొందవచ్చని తెలిపారు.
Similar News
News October 10, 2025
నారదుని భక్తి సూత్రాలు – 5

‘యత్ప్రాప్య నకించి ద్వాంఛతిన శోచతి
న ద్వేష్టి న రమతే నో త్సాహీ భవతి’ నారదుని భక్తి సూత్రాల్లో ఇది ఐదవది. దీనర్థం.. ఎవరైతే పరమాత్మ ప్రేమను పొందుతారో, వారు ఆ తర్వాత ఏమీ కోరుకోరు. ఎంతటి కష్టమొచ్చినా బాధపడరు. ఎవర్నీ ద్వేషించరు. చిన్న సంతోషాలకు పొంగిపోరు. అనవసర విషయాల పట్ల ఉత్సాహం చూపరు. అంటే.. దైవ దర్శనం తర్వాత మనిషి సుఖ-దుఃఖాలకు అతీతంగా, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడని అర్థం. <<-se>>#NBS<<>>
News October 10, 2025
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియెట్-2025 పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగుస్తుండటంతో ఈనెల 22 వరకు దాన్ని బోర్డు పొడిగించింది. జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ప్రయివేటు అభ్యర్థులు గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించింది. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇదే చివరి ఛాన్సు అని మరోసారి పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా స్పష్టం చేశారు.
News October 10, 2025
2047నాటికి నంబర్ వన్‌గా AP: చంద్రబాబు

AP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘రామాయపట్నంలో త్వరలో BPCL పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది. 2047నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పటికి దేశంలోనే AP నంబర్ వన్‌గా అవతరిస్తుంది’ అని తెలిపారు.