News August 12, 2024

నెలకు రూ.1.50 లక్షల జీతం సరిపోవడం లేదని ట్వీట్

image

ఏటా ₹25లక్షల జీతం వస్తున్నా, ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి ఏమీ మిగలడం లేదని సౌరవ్ దత్త అనే వ్యక్తి చేసిన పోస్ట్ Xలో వైరలవుతోంది. ‘నెలకు ₹1.50లక్షలు వస్తాయి. అందులో ₹లక్ష EMI, రెంట్‌కు, ₹25వేలు ఫుడ్, సినిమాలు, ట్రిప్స్‌కు, ₹25వేలు ఎమర్జెన్సీ/మెడికల్‌కి సరిపోతుంది. ఇలా మొత్తం ఖర్చవుతోంది. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏమీ మిగలడం లేదు’ అని ట్వీట్ చేశారు. ఇంత జీతం మీకే వస్తే ఎలా సేవ్ చేస్తారు? కామెంట్ చేయండి.

Similar News

News January 15, 2025

గేమ్ ఛేంజర్ NETT కలెక్షన్స్ ఎంతంటే?

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా 5 రోజుల్లో ₹100కోట్ల NETT కలెక్షన్స్ సాధించినట్లు ఇండియా టుడే తెలిపింది. తొలి రోజు ₹51కోట్లు, తర్వాతి 4 రోజుల్లో వరుసగా ₹21.6కోట్లు, ₹15.9కోట్లు, ₹7.65కోట్లు, ₹10 కోట్లు వసూలు చేసిందని పేర్కొంది. మొత్తం <<15125676>>NETT<<>> వసూళ్లు ₹106.15 అని పేర్కొంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 10న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

News January 15, 2025

BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్

image

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.

News January 15, 2025

‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. నిర్మాత ఆవేదన

image

‘గేమ్ ఛేంజర్’ రిలీజైన నాలుగైదు రోజుల్లోనే బస్సుల్లో, కేబుల్ ఛానల్స్‌లో ప్రసారమవడం ఆందోళన కలిగిస్తోందని నిర్మాత SKN ట్వీట్ చేశారు. ‘సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 3-4 ఏళ్ల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఇవి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాను బతికించుకునేందుకు ఏకమవుదాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.