News June 22, 2024
పని చెప్పకుండా 20 ఏళ్లుగా జీతం చెల్లింపు.. కోర్టు మెట్లెక్కిన ఉద్యోగి

ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోబెట్టి జీతం ఇస్తామంటే ఎవరు కాదంటారు. ఫ్రాన్స్‌లోని టెలికాం దిగ్గజం ఆరెంజ్‌లో పనిచేసే లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్‌కు 20 ఏళ్లుగా ఎలాంటి పని చెప్పకుండా జీతం చెల్లిస్తున్నారు. అయితే పని చేయకుండా జీతం తీసుకోవడం చాలా కష్టంగా ఉందని ఆమె కంపెనీపై కేసు వేసింది. ఆమె దివ్యాంగురాలు కావడంతో.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆమెకు తగిన పని లేకపోవడంతో కంపెనీ ఇలా చేస్తోంది.
Similar News
News December 3, 2025
ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్‌లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్‌ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
News December 3, 2025
NCSSRలో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ (<


