News May 10, 2024
ఎంపీకి వచ్చే జీతం.. లభించే సౌకర్యాలివే!

✒ ప్రతి నెలా ₹లక్ష జీతం(అలవెన్సులు ₹1.30 లక్షలు).
✒ MP, ఆయన భార్యకు ఏటా 34సార్లు ఉచిత విమాన ప్రయాణం, ఫస్ట్ క్లాస్ AC కోచ్‌లో ఫ్రీ జర్నీ. రోడ్డు రవాణా అయితే కి.మీకు ₹16 చొప్పున అందుతుంది.
✒ పాథాలాజికల్ లాబొరేటరీ, ECG, డెంటల్, చర్మ, కంటి ఆరోగ్య సేవలు ఉచితం. ఢిల్లీలో నివాస వసతి కల్పిస్తారు.
✒ 3 టెలిఫోన్లను వాడుకోవచ్చు. ఏడాదిలో 50వేల ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు.
✒ పదవి అనంతరం ₹50వేల పింఛన్.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News September 14, 2025
SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News September 14, 2025
త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
News September 14, 2025
శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు