News April 6, 2024
రూ.4-6 లక్షలకు శిశువుల అమ్మకం.. రాకెట్‌ను ఛేదించిన CBI

చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్‌ను CBI ఛేదించింది. ఢిల్లీ, హరియాణాలోని ఏడు ప్రాంతాల్లో ఒకేసారి దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసింది. ‘ఈ ముఠా సభ్యులు పేద తల్లిదండ్రుల నుంచి 1-15 రోజుల వయసున్న నవజాత శిశువులను కొనుగోలు చేస్తారు. పిల్లలు లేని దంపతులను సోషల్ మీడియాలో సంప్రదించి వారికి శిశువులను ₹4 లక్షల నుంచి ₹6 లక్షలకు అమ్ముతున్నారు. స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశాం’ అని అధికారులు తెలిపారు.
Similar News
News January 7, 2026
తెలుగులో ఛార్జ్‌షీట్.. పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం

TG: పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాల సమర్పణ అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. దీంతో అటు బాధితులు, ఇటు నిందితులకు అందులోని అంశాలు అర్థం కాక ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో దుండిగల్ PSలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగులో 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసి పోలీస్ శాఖలో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ శిఖా గోయల్ ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు.
News January 7, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

* కొబ్బరి ముక్కలు నిల్వ ఉన్నా వాసన రాకుండా ఉండాలంటే, చిప్పల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేయాలి.
* బాదం, వేరుశనగ, జీడిపప్పు ప్లాస్టిక్ సంచుల్లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే త్వరగా మెత్తబడిపోవు.
* బిస్కట్లు నిల్వ చేసే డబ్బాలో అడుగున ఒక బ్రెడ్ స్లైస్ ఉంచితే కరకరలాడుతూ ఉంటాయి.
* చక్కెరను పొడిలా చేస్తున్నప్పుడు కొన్ని బియ్యపు గింజలు కూడా వేయండి. ఇలా చేస్తే చక్కెర ముద్ద కాకుండా పొడిలా వస్తుంది.
News January 7, 2026
ఏడు చేపల కథలో అంతరార్థం ఇదే..

7 చేపల కథలో ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. కథలోని రాజు మనిషైతే ఏడుగురు కొడుకులు మనలోని సప్తధాతువులు. ఎండని ఏడో చేపే మన మనసు. 6 అరిషడ్వర్గాలను జయించినా, చంచలమైన మనస్సును జయించడం కష్టం. దీనికి అడ్డుపడే గడ్డిమేటు మన అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవాలంటే జ్ఞానమనే ‘ఆవు’ మేయాలి. ఆ ఆవును మేపాల్సింది సద్గురువు. సంసారమనే చీమ కుట్టే బాధల నుంచి విముక్తులై గురువు ద్వారా జ్ఞానాన్ని పొందితేనే మోక్షం లభిస్తుందని కథా సారాంశం.


