News November 9, 2024

ఇవాళ్టి నుంచే శనగ విత్తనాల విక్రయాలు

image

TG: యాసంగి సీజన్ కోసం రైతులకు నేటి నుంచి శనగ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. క్వింటాలు ధర రూ.9,000 ఉండగా, ప్రభుత్వం రూ.300 రాయితీ ఇస్తోంది. జేజీ 11, జాకీ రకాల విత్తనాలను 20వేల క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉంచారు. కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048, జేజీఎల్ 24423 రకాలు 50వేల క్వింటాళ్ల వరకు విక్రయించనున్నారు. కరోనాకు ముందు 33% రాయితీతో విక్రయించగా, ఇప్పుడు 3.3% సబ్సిడీనే ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు.

Similar News

News October 27, 2025

ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపులో మార్పులు ఎందుకంటే?

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడం తెలిసిందే. ఇక నుంచి శ్లాబ్ నిర్మాణం పూర్తయ్యాక ₹2 లక్షలు కాకుండా ₹1.40 లక్షలే ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకంలో ఉపాధి హామీ కింద 90 రోజుల పనిదినాలు కల్పిస్తుండటం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చివరి విడత ₹లక్షతో కలిపి మిగతా ₹60 వేలను అందించనుంది.

News October 27, 2025

తుఫాను ఎఫెక్ట్.. 22 జిల్లాల్లో సెలవులు

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడ(D)లో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అటు రేపు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.

News October 27, 2025

విషాదాలు మిగిలిస్తున్న తుఫాన్లు

image

AP: తుఫాన్లు కోస్తాంధ్రాను అతలాకుతలం చేస్తున్నాయి. 1971-2023 మధ్య 60 తీవ్రమైన సైక్లోన్లు తీరం దాటాయి. 1971లో బారువ, 1977లో దివిసీమ, 1996లో బలుసుతిప్పతో పాటు తర్వాత సంభవించిన ఖైముక్, లైలా, జల్, నీలం, హుద్‌హుద్, తితిలీ తుఫాన్లు తీవ్ర ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. MAR నుంచి JUNE.. SEP నుంచి DEC వరకు 2 సీజన్లలో సైక్లోన్లు సంభవిస్తుంటాయి. కానీ వాతావరణ మార్పులతో OCTలోనే దూసుకొస్తున్నాయి.