News April 12, 2025
సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభం

TG: నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయత మధ్యలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. సుమారు 18 కి.మీ దట్టమైన అటవీ ప్రాంతంలో నడిచి స్వామివారిని చేరుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ యాత్రను తెలంగాణ అమరనాథ్ అని పిలుస్తుంటారు. 3రోజుల జాతర కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు తెలిపారు.
Similar News
News November 13, 2025
నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.
News November 13, 2025
ఉసిరిలో కాయకుళ్లు, నల్లమచ్చ తెగుళ్ల నివారణ

కాయకుళ్లు తెగులు సోకిన ఉసిరి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాటి నుంచి చెడువాసన వస్తుంటుంది. దీని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ లేదా 1% బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీయాలి. ఉసిరిలో నల్లమచ్చ తెగులు వల్ల కాయలపై నల్ల మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమంగా పెద్దవి అవుతాయి. తెగులు కట్టడికి లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ను తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేయాలి.
News November 13, 2025
తాజా సినీ ముచ్చట్లు

⋆ కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ నటించబోయే సినిమా నుంచి అనివార్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ సి.సుందర్
⋆ అట్లీ-అల్లు అర్జున్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మే నాటికి బన్నీ షూటింగ్ పూర్తవుతుంది: సినీ వర్గాలు
⋆ దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ, సముద్రఖని నటించిన ‘కాంత’ సినిమాకు U/A సర్టిఫికెట్.. సినిమా నిడివి 2.40hrs.. రేపే థియేటర్లలో విడుదల


