News April 14, 2024

కాల్పుల సమయంలో ఇంట్లోనే సల్మాన్!

image

ఇవాళ ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. <<13048942>>ఘటన<<>> సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దుండగుల కాల్పుల్లో ఓ బుల్లెట్ మొదటి అంతస్తులోకి దూసుకెళ్లినట్లు సమాచారం. అదృష్టవశాత్తు తమ అభిమాన హీరోకు ఏమీ కాలేదని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. కాగా గత ఏడాది సల్మాన్‌కు బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో ఆయనకు Yప్లస్ భద్రతను కల్పించారు.

Similar News

News March 17, 2026

ఇరాన్ ప్రజలకు ఇదే మంచి అవకాశం: నెతన్యాహు

image

తమ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. అలాగే ‘బసిజ్’ పారామిలిటరీ చీఫ్ గోలమ్‌రెజా సులేమానీ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్‌లో తమ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఇరాన్ ప్రజలకు కల్పించాలనే ఆశతోనే ఈ అటాక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ ఒకేరోజులో జరగవని.. స్థిరంగా పోరాడితే అన్నీ సాధ్యమేనన్నారు.

News March 17, 2026

రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

image

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

News March 17, 2026

చదువులో కాకపోయినా.. క్రికెట్‌లో 80% కొట్టేసిన సూర్యకుమార్

image

కెప్టెన్‌గా సూర్యకుమార్ విన్నింగ్ పర్సంటేజ్ 80% దాటింది. ‘చదువులో నాకు ఎప్పుడూ 50-60% కూడా దాటలేదు. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజీని క్రికెట్‌లో సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ఫ్యామిలీ మొదట్లో చదువుపై ఫోకస్ చేయమన్నా.. తర్వాత తన ప్యాషన్‌ను గుర్తించి సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. WC నెగ్గిన తర్వాత కూడా తన భార్య దేవిషా తనలో అహంకారం పెరగకుండా చూస్తోందన్నారు.