News November 9, 2024
భారీ సెక్యూరిటీ మధ్య సల్మాన్ మూవీ షూటింగ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భారీ సెక్యూరిటీ మధ్య ‘సికందర్’ మూవీ షూట్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హోటల్లో చిత్రీకరిస్తున్నారు. ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులందరూ దాదాపు 70 మంది ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. మొత్తం 4 అంచెల రక్షణ ఏర్పాటు చేశారు. కాగా సల్మాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 7, 2025
క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.
News November 7, 2025
రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

AP: ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా? COMMENT
News November 7, 2025
₹4 లక్షలు పెద్ద అమౌంటే కదా: షమీ మాజీ భార్యకు సుప్రీం ప్రశ్న

భారత క్రికెటర్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ₹1.5లక్షలు, కూతురికి ₹2.5లక్షలు నెలవారీ భరణంగా ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. షమీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని అమౌంట్‌ను పెంచాలని కోరారు. దీంతో షమీ, బెంగాల్ ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. ‘ఇప్పటికే ఇస్తున్న ₹4L పెద్ద అమౌంటే కదా’ అని జహాన్‌ను ప్రశ్నించింది. విచారణను DECకు వాయిదా వేసింది.


