News March 27, 2025
‘రామ జన్మభూమి’ ఎడిషన్ వాచ్‌తో సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘రామ జన్మభూమి’ స్పెషల్ ఎడిషన్ వాచ్ ధరించారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనెల 30న థియేటర్లలో కలుసుకుందాం అని రాసుకొచ్చారు. ఆయన నటించిన ‘సికందర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ ఫొటో షేర్ చేశారు. వాచ్‌లో రాముడు, హనుమంతుడు, అయోధ్య ఆలయ డిజైన్లు ఉన్నాయి.
Similar News
News December 8, 2025
జగిత్యాల: మూడో విడత.. రేపే అభ్యర్థులకు గుర్తులు

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు రేపు గుర్తులు కేటాయించనున్నారు. దీంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎన్నికల అధికారులు పేర్ల ఆధారంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు అలాట్ చేయనున్నారు. ఓటర్లు సులువుగా గుర్తుపట్టే గుర్తు వస్తే బాగుండునని, ఎక్కువ వాడని వస్తువుల గుర్తులువస్తే ఇబ్బందని ముచ్చటించుకుంటున్నారు.
News December 8, 2025
వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

TG: 2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తోంది’ అని చెప్పారు.
News December 8, 2025
చెన్నై టు రష్యా.. నూతన సరకు రవాణా మార్గం

భారత్-రష్యా మధ్య సరకుల రవాణా సమయం రానున్న కాలంలో సగం వరకు తగ్గనుంది. ప్రస్తుతం రష్యాకు నౌకల ద్వారా సరకుల రవాణాకు 40 రోజుల సమయం పడుతోంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చెన్నై-వ్లాడివోస్టాక్ మధ్య తూర్పు కారిడార్ ఏర్పాటుపై చర్చించారు. ఇది కార్యరూపం దాల్చితే 5,700 కి.మీ దూరం తగ్గి 24 రోజుల్లోనే రష్యాకు సరకులు చేరతాయి. కాగా ప్రపంచ ఉద్రిక్తల నేపథ్యంలో ఇది సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు.


