News August 29, 2024
₹1.4కోట్ల కారు కొన్న సల్మాన్ బాడీగార్డ్!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా(గుర్మీత్ సింగ్ జోలీ) ఇటీవల ఖరీదైన రేంజ్ రోవర్ కారు కొన్నారు. దాని విలువ ₹1.4కోట్లు అని తెలుస్తోంది. కారు కొన్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ‘షేరా అన్నా నన్ను మీ బాడీగార్డుగా పెట్టుకోండి. నేను కూడా కారు కొనుక్కుంటా’ అని కామెంట్స్ వస్తున్నాయి. షేరా 1995 నుంచి సల్మాన్ దగ్గర పని చేస్తున్నారు. అతడికి సొంతంగా సెక్యూరిటీ సంస్థ కూడా ఉంది.
Similar News
News November 10, 2025
తెలంగాణ న్యూస్

✦ దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందన్న CM రేవంత్.. రేపు మౌలానా జయంతి సందర్భంగా స్మరించుకున్న CM
✦ 2026 చివరి నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
✦ ఈనెల 17, 18 తేదీల్లో HYD సమీపంలోని తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. <
News November 10, 2025
భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.
News November 10, 2025
ఢిల్లీ పేలుడు.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ సీపీతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే NSG, NIA టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. అటు పేలుడులో 8 మంది మరణించగా, 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. కార్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎర్రకోట వద్ద భీతావహ వాతావరణం నెలకొంది.


