News October 17, 2024
బిష్ణోయ్‌కి సల్మాన్ మాజీ ప్రేయసి సందేశం

నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపాలని చూస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని జూమ్ కాల్ చేయమంటూ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ‘నమస్తే లారెన్స్ భాయ్. మీరు జైల్లో ఉన్నా కూడా జూమ్ కాల్స్ చేస్తుంటారని నాకు తెలిసింది. మీతో మాట్లాడే పని ఉంది. దానికి ఏర్పాట్లు చేయండి. నాతో మాట్లాడితే మీకే లాభం. మీ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి’ అని సోమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Similar News
News January 20, 2026
మదనపల్లె: కర్నూలులోనూ ఏసీబీ దాడులు

మదనపల్లె DEO ఆఫీసుపై ACB అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. గుర్రంకొండలోని ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రినాయుడు వద్ద సోమవారం రూ.45 వేలు లంచం తీసుకుంటుండగా కడపకు చెందిన ACB డీఎస్పీ సీతారామారావు, CIనాగరాజ దాడులు చేశారు. సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా(మున్నా), ఏడీ రాజశేఖర్‌ను అరెస్టు చేశారు. కర్నూలులోని ఏడీ రాజశేఖర్ సొంత ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
News January 20, 2026
రేపటి నుంచి JEE మెయిన్స్

TG: JEE మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉ.9 గం.-మ.12 వరకు, మ.3గం.-సా.6 వరకు 2 సెషన్స్ ఉంటాయి. HYD, SEC, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సహా రాష్ట్రంలో 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 40వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
News January 20, 2026
మాఘ మాసంలో చేయాల్సిన పూజలివే..

మాఘ మాసంలో నారాయణుడిని, శివుడిని పూజించాలి. వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని, రథసప్తమి నాడు సూర్యుడిని, భీష్మ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం శ్రేష్టం. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో శివార్చన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూజలతో పాటు శక్తి కొలది నువ్వులు, బెల్లం, ఉప్పు, వస్త్రాలను దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుందని పురాణాల వాక్కు. ఆదివారం సూర్యారాధన చేయాలి.


