News March 19, 2024

సెల్యూట్.. చనిపోతూ ముగ్గురిని కాపాడాడు

image

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అవయవాలు దొరక్క ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంపై ఎంత అవగాహన కల్పించినా ప్రజలు ముందుకు రావడం లేదు. అయితే, తాజాగా తెలంగాణకు చెందిన ప్రభాస్ అనే 19 ఏళ్ల యువకుడు తాను చనిపోతూ ఇతరులకు ప్రాణదానం చేశారు. ప్రభాస్ చనిపోవడంతో అతడి 2 కిడ్నీలు, లివర్‌ను కుటుంబీకులు దానం చేసి మరో ముగ్గురిని కాపాడారు. ఈ విషయాన్ని ‘జీవన్‌దాన్ తెలంగాణ’ ట్వీట్ చేసింది.

Similar News

News April 2, 2025

ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయొచ్చుగా..!

image

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరమై మండుటెండలో బయటకు వస్తే సిగ్నల్స్ వద్ద ఉడికిపోవాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ క్లాత్‌తో తాత్కాలిక టెంట్‌ ఏర్పాటు చేశారు. ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

News April 2, 2025

2.O భిన్నంగా ఉంటుంది: జగన్

image

AP: వచ్చే ఎన్నికల్లో YCP భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. కరోనా వల్ల కార్యకర్తలకు నేను చేయాల్సినంత చేసుండకపోవచ్చు. ఈసారి జగన్ 2.O భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పులపై CBN అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

News April 2, 2025

బుమ్రా రీఎంట్రీ మరింత ఆలస్యం?

image

వెన్నునొప్పితో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ బుమ్రా IPLలో ఆడేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న ఆయన ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో వెన్నులో ఎలాంటి ఫ్రాక్చర్ కాకుండా ఉండేందుకు క్రమ క్రమంగా అతడి వర్క్‌లోడ్‌ను పెంచుతున్నట్లు తెలుస్తోంది. మరో 2 వారాల్లో ఆయన MIకి అందుబాటులోకి వస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!