News November 5, 2024

సెల్యూట్ తల్లి.. భర్త మరణంతో కుటుంబానికి అండగా!

image

కుటుంబానికి అండగా నిలిచేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఎంత కష్టమైనా చేసే మహిళలున్నారు. అలాంటి ఓ మహిళ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. MSc చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆకస్మికంగా మరణించడంతో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ పర్సన్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అత్తామామ, పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ఆమె రేయింబవళ్లు శ్రమిస్తోంది. సుప్రీతి ఎందరికో స్ఫూర్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Similar News

News November 28, 2025

వరంగల్ MGMలో లంచగొండిలు.. ఒకరి తొలగింపు

image

MGM ఆసుపత్రిలో తల వెంట్రుకలను తొలగించడానికి ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లంచం అడిగి అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లాకు చెందిన ఓ మహిళ తన బంధువు సర్జరీ కొసం రాగా, వెంట్రుకలను తొలగించానికి సదరు ఉద్యోగి శీను డబ్బులు అడిగాడు. లంచగొండిని పట్టించాలనే ఉద్దేశ్యంతో ఆమె డబ్బులు ఇస్తున్న సమయంలో ఫోన్లో వీడియోతీసి ఉన్నతాధికారులకు పంపింది. దీంతో ఆ ఉద్యోగిని తొలగించారు. మరో మేల్ నర్సు లంచం వ్యవహారంపైనా విచారణ జరుగుతోందట.

News November 28, 2025

గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

image

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.