News April 5, 2025

సెల్యూట్ సిద్ధార్థ్: చివరి క్షణాల్లోనూ దేశం కోసమే..

image

జామ్‌నగర్‌లో కూలిపోయిన జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ (28) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. విమానం బయల్దేరిన కాసేపటికే సాంకేతిక వైఫల్యం తలెత్తింది. వెంటనే కో పైలట్‌ను సేఫ్‌గా బయటపడేలా చేశాడు. సిద్ధార్థ్ తప్పించుకునే ఛాన్స్ ఉన్నా విమానాన్ని జనావాసాలకు దూరంగా పడేలా చేసి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. చావులోనూ తన ప్రాణం కోసం కాకుండా దేశం కోసమే పనిచేశాడు.

Similar News

News April 5, 2025

భార్యను చంపాడని జైలు శిక్ష.. రెండేళ్ల తర్వాత ట్విస్ట్!

image

తప్పిపోయిన భార్యను హత్య చేశాడనే ఆరోపణతో ఓ భర్త రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కర్ణాటకలోని కొడగుకి చెందిన సురేశ్ 2021లో తన భార్య మల్లిగే కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది తర్వాత పక్క ఊరిలో అస్థిపంజరం కనిపించడంతో అనుమానించి భర్తను అరెస్ట్ చేశారు. ఇటీవల మల్లిగే ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో సురేశ్ నిర్దోషిగా బయటకువచ్చాడు. అమాయకుడిని జైల్లో పెట్టారంటూ పోలీసులపై కోర్టు ఫైర్ అయింది.

News April 5, 2025

ముంబైకి పొలార్డ్ లాంటి ప్లేయర్ ఇక దొరకడా?

image

IPLలో 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ప్రస్తుతం స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతోంది. పొలార్డ్ లాంటి ఫినిషర్ లేకపోవడమూ దీనికి కారణమని ఫ్యాన్స్ అంటున్నారు. 2012 నుంచి 2021 వరకు ఎన్నో మ్యాచుల్లో MIకి ఆయన విజయాలు అందించారు. టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఫామ్ కోల్పోయి రిటైర్ అయ్యారు. ఆ తర్వాతి నుంచి MIకి సరైన ఫినిషర్ దొరకట్లేదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?

News April 5, 2025

కొత్త ఆలోచనలతోనే రాష్ట్ర అభివృద్ధి: CBN

image

AP: ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. NTR జిల్లా ముప్పాళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి రోజుల్లో సెల్‌ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందని, అనేక సేవలతో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!