News June 20, 2024
హైదరాబాద్‌లో ‘సెల్యూట్ తెలంగాణ’

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో BJP సత్తా చాటిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు హైదరాబాద్‌లో ‘సెల్యూట్ తెలంగాణ’ ర్యాలీ చేపట్టారు. ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ మీదుగా ర్యాలీ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొనగా వారికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి.
Similar News
News January 22, 2026
ఆస్కార్-2026 నామినీల లిస్ట్ విడుదల

ఆస్కార్ రేసులో నిలిచిన నామినీ పేర్లను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి పోటీ పడిన ‘హోమ్ బౌండ్’కి చోటు దక్కలేదు. ఈ విభాగంలో ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), ఇట్ వాజ్ జస్ట్ యాన్ ఆక్సిడెంట్(ఫ్రాన్స్), సెంటిమెంటల్ వాల్యూ (నార్వే), సిరాట్(స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (ట్యునీషియా) చోటు దక్కించుకున్నాయి. విభాగాల వారీగా లిస్ట్ కోసం పైన ఫొటోలు స్లైడ్ చేయండి.
News January 22, 2026
కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు: విజయసాయి

AP: మాజీ MP విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. కూటమిని విడగొడితేనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 22, 2026
అవును.. ప్రేమలో ఉన్నా: ఫరియా అబ్దుల్లా

తాను ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ అబ్బాయి హిందువా ముస్లిమా అని యాంకర్ అడగగా హిందువేనని బదులిచ్చారు. లవ్ వల్ల తన లైఫ్‌లో బ్యాలెన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాను, తన బాయ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్స్ కాదని, అతడు డాన్స్ బ్యాక్ గ్రౌండ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. తాను ర్యాప్, డాన్స్‌లో రాణించడానికి అతడి సపోర్టే కారణమని చెప్పారు.


