News October 18, 2024

‘తల్లికి వందనం’ రూ.15,000.. ఎప్పుడంటే?

image

AP: వచ్చే జనవరిలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.20 వేల లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ను మార్చి/ఏప్రిల్‌లో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 18, 2024

భారత ‘RAW’ అధికారిపై అమెరికా అభియోగాలు

image

భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ఆఫీసర్ వికాస్ యాదవ్‌పై అమెరికా అభియోగాలు మోపింది. న్యూయార్క్‌లో ఖలీస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూను హతమార్చేందుకు వికాస్ కుట్ర చేశారని FBI పేర్కొంది. ఇందుకోసం నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని నియమించుకున్నారని, గతేడాది అతడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు కమిటీని నియమిస్తామని భారత్ చెప్పగా.. అమెరికా సంతృప్తి వ్యక్తం చేసింది.

News October 18, 2024

మందుబాబులకు గుడ్ న్యూస్

image

AP: రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్‌ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరునాటికి మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

News October 18, 2024

1,690 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!

image

TG: రాష్ట్రంలో 1,690 వైద్య పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో 1,690 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీటికి నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, 2025 మార్చి/ఏప్రిల్‌లో భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం. అప్పటివరకూ కాంట్రాక్టు వైద్యుల నియామకం కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.