News August 28, 2025

SALUTE: మీరే మా సూపర్ హీరోస్!

image

ఆపద వేళ పోలీసులు సూపర్ హీరోలుగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సాయం కోసం ఎదురుచూస్తోన్న వేలాది మందికి చేయందిస్తున్నారు. భారీ వరదను సైతం లెక్క చేయకుండా ఇళ్లలోకి వెళ్లి వృద్ధులు, పిల్లలను ఒడ్డుకు చేరుస్తున్నారు. వీరికి ఆర్మీ జవాన్లు సైతం తోడవడంతో ప్రాణనష్టం జరగకుండా రేయింబవళ్లు అలర్ట్‌గా ఉంటున్నారు. వీరికి సెల్యూట్ చేయాల్సిందే.

Similar News

News August 28, 2025

US సాఫ్ట్‌ డ్రింక్స్ బహిష్కరిద్దామంటూ నెట్టింట చర్చ

image

టారిఫ్స్‌ పెంచి భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే <<17536241>>LPUలో<<>> US సాఫ్ట్ డ్రింక్స్‌ను బ్యాన్ చేశారు. ఇలాంటి నిర్ణయాన్నే దేశమంతా తీసుకుని అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వదేశీ ప్రొడక్ట్‌లు వాడాలని, టారిఫ్స్ తగ్గించకపోతే USకు చెందిన సోషల్ మీడియా యాప్స్, మొబైల్స్‌ను కూడా ఇదే విధంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.

News August 28, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News August 28, 2025

రేపు హాల్‌టికెట్లు విడుదల

image

APలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకోవాలని, హాల్‌టికెట్లను APPSC <>వెబ్‌సైటులోనే <<>>డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.