News November 6, 2024

త్రివిధ దళాల సెల్యూట్లలో తేడాలివే!

image

ఇండియన్ ఆర్మీ సెల్యూట్: అరచేతిని ఓపెన్ చేసి, వేళ్లన్నీ కలిపి, మధ్య వేలు దాదాపు హ్యాట్‌బ్యాండ్/కనుబొమ్మలను తాకుతుంది. (చేతిలో ఏ ఆయుధాలు లేవని చెప్పడం)
ఇండియన్ నేవీ సెల్యూట్: నుదిటికి 90డిగ్రీల కోణంలో అరచేతిని ఓపెన్ చేసి నేల వైపు చూపిస్తారు. (పనిలో చేతికి అంటిన గ్రీజు కనిపించకుండా)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్: నేలకు 45డిగ్రీల కోణంలో అరచేతిని ఓపెన్ చేసి చేస్తారు.(ఆకాశంలోకి వెళతామనడానికి సూచిక)

Similar News

News November 6, 2024

ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నటి భర్త

image

నటి స్వర భాస్కర్ భర్త ఫాహద్ అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ముంబైలోని అనుశక్తి నగర్ నుంచి ఆయన NCP-SP తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే NCP-SPలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తన భర్త క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినట్లు స్వర ట్వీట్ చేశారు. అతడికి మద్దతుగా నిలిచి విరాళాలు అందించాలని అభ్యర్థించారు. గతేడాది అహ్మద్‌ను స్వర పెళ్లి చేసుకున్నారు.

News November 6, 2024

మరికొన్ని గంటల్లో ముగియనున్న US పోలింగ్

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్న ఓటర్లు, కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్నిచోట్లా భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు పోలింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచే ఎర్లీ ట్రెండ్స్‌ను బట్టి ప్రెసిడెంట్ ఎవరనేది తేలిపోనుంది.

News November 6, 2024

అంతరిక్షం నుంచి ఓటేసిన సునీత విలియమ్స్

image

అమెరికాలో పోలింగ్ సందర్భంగా అంతరిక్షంలో ఉన్న ఆదేశ వ్యోమగాములు అక్కడి నుంచే ఓటేశారు. సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్, డాన్ పెటిట్‌, నిక్ హాగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు అమెరికా జాతీయ జెండాలు కలిగిన సాక్స్‌లు వేసుకొని ‘అమెరికన్లుగా గర్వపడుతున్నాం’ అని సందేశం పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వ్యోమగాములు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.