News August 23, 2025
సల్వాజుడుం తీర్పు నాది కాదు.. సుప్రీంకోర్టుది: సుదర్శన్ రెడ్డి

తాను నక్సలిజాన్ని ప్రోత్సహించానన్న కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై INDI కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి స్పందించారు. సల్వాజుడుంపై తీర్పు వ్యక్తిగతం కాదని, సుప్రీంకోర్టుదని స్పష్టం చేశారు. దీనిపై షాతో వాదనకు దిగనని, చర్చ ఏదైనా పద్ధతిగా జరగాలని హితవు పలికారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతూ అది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య అని వివరించారు.
Similar News
News August 23, 2025
అఖిల్ ఒక్క రూపాయి తీసుకోలేదు: అనిల్ సుంకర

తనకు కష్టం వస్తే తాను వర్క్ చేసిన హీరోలంతా సపోర్ట్‌గా నిలుస్తారని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మూవీస్ ఆడకపోతే తన హీరోలు ఎంతో మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. భోళా శంకర్ మూవీ విషయంలో చిరంజీవి చాలా సహాయం చేశారని చెప్పారు. అలాగే, ఏజెంట్ మూవీకి అఖిల్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. 2023లో 4 నెలల గ్యాప్‌లో విడుదలైన ఈ 2 చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.
News August 23, 2025
హండ్రెడ్ లీగ్.. మిల్లర్, బ్రూక్ సిక్సర్ల మోత

‘ది హండ్రెడ్’ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఓవల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 16 బంతుల్లోనే 37 రన్స్ బాదారు. తాను ఎదుర్కొన్న చివరి 9 బంతుల్లో ఏకంగా 5 సిక్సర్లు బాదారు. అంతకుముందు బ్రూక్ సైతం విధ్వంసం సృష్టించారు. 27 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 56 రన్స్ చేశారు. క్రాలీ-49(25 బంతులు), డేవిడ్ మలన్-34(21) కూడా రాణించడంతో సూపర్ ఛార్జర్స్ 100 బంతుల్లో 198 రన్స్ చేసింది.
News August 23, 2025
ఆన్‌లైన్‌లో గంజాయి రోలింగ్ కవర్స్.. నెట్టింట ఫిర్యాదు

TG: క్యూ- కామర్స్ సైట్లలో గంజాయి రోలింగ్ పేపర్లు అందుబాటులో ఉండటంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. వీటి అమ్మకంపై ఓ నెటిజన్ ‘X’ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మాదకద్రవ్యాలను అరికట్టేందుకు మీరు సీరియస్‌గా పనిచేస్తున్నట్లయితే గత 48 గంటల్లో రోలింగ్ పేపర్లు కొన్నవారి వివరాలు తీసుకోండి. వారికి డ్రగ్స్ టెస్టులు చేయండి’ అని కోరారు.