News June 26, 2024
శామ్ పిట్రోడాకు తిరిగి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అనుహ్య నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన శామ్ పిట్రోడాను తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్‌లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.